sudhakar తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

సరసరస;sudhakar

అద్భుతం గురువుగారు. 🙏 ఆచమనం లో పలికే కేశవ, నారాయణ, మాధవ నామాలకు అర్ధం నాకు నారాయణ కవచం లో అర్ధం అయ్యింది. కేశవుడు ఉదయం, నారాయణుడు మధ్యాహ్నం, మాధవుడు సాయంత్రం కాపాడు గాక అని అర్ధం అయింది. మీ జ్ఞానం నారాయణ ప్రసాదితం. 🙏

01 April 2025 7:27 AM

Ekalavyas పై వ్యాఖ్యలు;Sudhakar

కారణాలు ఏమైనప్పటికీ , గురుప్రసాద్ చేసిన పని అత్యంత హేయమైనది.
ప్రతి ప్రాణం విలువైనదే ! గురుప్రసాద్ ప్రాణం, ఆయన ద్వారా పుట్టిన ,అభం శుభం తెలియని పిల్లల ప్రాణం కూడా ! అట్లాగే, భారత దేశం లో నిత్యం ( గృహ హింస ద్వారా ) మరణిస్తున్న స్త్రీల ప్రాణం కూడా ! ఆ పరిణామాలకు బాధ్యత , భార్యా భర్త లిద్దరిదీ ! సమాజానిదీ కూడా !
విపరీతమైన ఆత్మ న్యూనతా భావం తో ,’ తన తో పాటుగా , తన పిల్లలు కూడా ఈ లోకం లో ఉండకూడదు’ ! అనుకునే
ఆలోచన , మానవులలోని రాక్షస ప్రవృత్తి ని బహిర్గతం చేస్తుంది !
ఇక చట్టాలు మార్చడం అనే విషయం ఇప్పుడు అప్రస్తుతం ! ఎందుకంటే , భారత దేశం లో గృహ హింస వల్ల , అనేక విధాలు గా నష్ట పోతున్నదీ , ప్రాణాలు కోల్పోతున్నవారిలో కనీసం 95 శాతం మంది స్త్రీలే ! ( ప్రత్యక్షం గా పురుషుల ద్వారానూ , పరోక్షం గా ఆత్మ హత్యల ద్వారానూ ) స్త్రీలే ! ఈ క్రింది వార్త చూడండి !

National Crime Records Bureau reveal that a crime against a woman is committed every three minutes, a woman is raped every 29 minutes, a dowry death occurs every 77 minutes, and one case of cruelty committed by either the husband or relative of the husband occurs every nine minutes.[3] This all occurs despite the fact that women in India are legally protected from domestic abuse under the Protection of Women from Domestic Violence Act.[3]

పాజిటివ్ దృక్పధం తో వివాహం చేసుకున్నా కూడా ! అకస్మాత్తు గా మరణం సంభవిస్తేఏమవుతుందో నని , ముందుగానే జీవిత భీమా చేసుకున్నట్టు, ప్రతి జంటా , ఇట్లాంటి కుటుంబ ఉపద్రవాలను కూడా, ఏ రకం గా పరిష్కరించుకోవాలో , ముందు గానే సంభాషించు కుంటే , ఉపయోగం ఎంతగానో ఉంటుంది, బలవన్మర ణాలూ , హత్యలతో పరిష్కారం చేసుకోకుండా ! ఒక వేళ, వారు తెలియని వయసు లో ఉన్నా కూడా , వారి వారి తలిదండ్రులు , వారిని కూర్చోబెట్టి , ఆ క్లిష్ట విషయాలు , ముందే చర్చించుకుంటే ఉత్తమం , కేవలం కట్నాలు ,కానుకల మాటలతో , విషాలు చిమ్ముకో కుండా !

మెచ్చుకోండి


27 October 2014 1:52 PM