మాలతి తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
కి స్పందనగా.
అవునండి. అర్థం చేసుకోగలం అనుకోడం వృథా ప్రయాస.
మెచ్చుకోండి
కి స్పందనగా.
నమస్కారం. అవునండి. బుద్ధిపూర్వకంగా తెలుకున్నా, మనసు ఒప్పుకోదు. టపామొదట చెప్పినట్టు కుశంకలు. :))
మెచ్చుకోండి
కి స్పందనగా.
అవునండి, మీరన్నది నిజమే. అందుకే పోల్చుకోగలుగుతున్నాను. సూతుడు శౌనకాది మహామునులకు, శుకుడు పరీక్షత్తుకి, మైత్రేయుడు విదురుడికి … ఇలా ఎవరు ఎవరికి చెప్పేరు అన్నది తెలుసుకోడానికే ఇంతకాలం పట్టింది. ఇక ఏం చెప్పేరు అన్నది చాలాసార్లే పునశ్చరణ అయింది. ప్రత్యేకించి నాదృష్టి సంస్కృతంలో పదాన్వయంమీదే. అంచేత ఒకొకప్పుడు శ్రద్ధ నిలవడం లేదు. ముఖ్యంగా కొన్నిచోట్ల పుష్పజాతులు, ఫలజాతులు, మృగ పక్షిజాతులపేర్లే అధ్యాయం అంతా ఉంటే. పైగా ఆచార్యులవార్లు బైదవే, ఓకేలాటి పదాలు వాడినప్పుడు కూడా నవ్వొస్తుంది. ఏదో లెండి కాలక్షేపం.
మెచ్చుకోండి
కి స్పందనగా.
అదే మరి. నాకు ఇంతకుముందు అలా వచ్చేది కానీ ఈమధ్య 4, 5 నెలలుగా అలా రావడంలేదు.
మెచ్చుకోండి
కి స్పందనగా.
అయ్యయ్యో, తప్పే. నీపేరు సౌమ్య కదూ. హీహీహీ. అసలేం జరిగిందంటే, notificationsలో వ్యాఖ్యాతపేరు కనిపించడంలేదు. అంగీకరించి, టపాకింద వెళ్లి చూసేవరకూ ఎవరో తెలీదు.
ఇంతకీ, నువ్వు చెప్పు ఎలా వ్యాఖ్యాతపేరు ఎలా కనిపెట్టడమో.
మెచ్చుకోండి
కి స్పందనగా.
చూసేను సునీతగారూ. అట్టే చదవడం, రాయడం లేదు కానీ చూస్తుంటాను. మీరు సమాచారం అందించినందుకు చాలా సంతోషం కలిగింది. – మాలతి
మెచ్చుకోండి
కి స్పందనగా.
అలాగా, సరేనండి. ధన్యవాదాలు. మళ్లీ చూస్తాను.
మెచ్చుకున్నవారు
కి స్పందనగా.
మీరే రైటండి. ఊరికే సరదాగారాసేను.
మెచ్చుకోండి
ఉచితంగా ఇక్కడ అందుబాటులో పెట్టినందుకు ధన్యవాదములు,
వనజగారూ,
ఏనుగు అంబారీ కథ చదివేను.
నేను 46ఏళ్ళగా ఈదేశంలో ఉన్నా సమాజంలో ఎవరితోనూ కలవలేదు కనక నాకు చాలా విషయాలు తెలీవు. నేను వచ్చినకొత్తలో ఇక్కడ డాలర్లంటే బోలెడు రూ. అని అనుకుంటారనుకున్నాను కానీ అది ఇంకా మారలేదని మీకథ చూసేకే అర్థమయింది. కూటికి పేదయితే కులానికి పేదా అన్న సామెతని మీరు ప్రత్యేకమైన పద్ధతిలో వాడడం నాకు నచ్చింది. అలాగే "మీనాన్నకి ఆమెపై ఎందుకంత జాలి"లాటివి కూడా సూక్ష్మంగా ఆలోచిస్తే తప్ప తోచవు. మీరు బాగానే పసి కట్టినట్టున్నారు మనిషితత్వం. నిజానికి మీరు రాసిన ఒకొక సంఘటన విడిగా మరో మంచి కథ కాగలదు. ఒక నవలకి సరిపడా సరుకుంది ఈ కథలో.
మంచికథ. బహుమతి గెలుచుకోగలకథ. మరొకసారి అభినందనలు.
వనజగారూ,
ఏనుగు అంబారీ కథ చదివేను.
నేను 46ఏళ్ళగా ఈదేశంలో ఉన్నా సమాజంలో ఎవరితోనూ కలవలేదు కనక నాకు చాలా విషయాలు తెలీవు. నేను వచ్చినకొత్తలో ఇక్కడ డాలర్లంటే బోలెడు రూ. అని అనుకుంటారనుకున్నాను కానీ అది ఇంకా మారలేదని మీకథ చూసేకే అర్థమయింది. కూటికి పేదయితే కులానికి పేదా అన్న సామెతని మీరు ప్రత్యేకమైన పద్ధతిలో వాడడం నాకు నచ్చింది. అలాగే "మీనాన్నకి ఆమెపై ఎందుకంత జాలి"లాటివి కూడా సూక్ష్మంగా ఆలోచిస్తే తప్ప తోచవు. మీరు బాగానే పసి కట్టినట్టున్నారు మనిషితత్వం. నిజానికి మీరు రాసిన ఒకొక సంఘటన విడిగా మరో మంచి కథ కాగలదు. ఒక నవలకి సరిపడా సరుకుంది ఈ కథలో.
మంచికథ. బహుమతి గెలుచుకోగలకథ. మరొకసారి అభినందనలు.
నేను మెంతికూర ఎప్పుడూ వాడలేదు కానీ అలసందగింజలతో ఇలాగే చేస్తాను. బాగుంటుంది
నోరి నరసింహశాస్త్రిగారి రుద్రమదేవి నవల నాకు ఎక్కువ నచ్చింది బాపిరాజు గారి గోనగన్నారెడ్డి కంటే. కూడా. ఇంతకాలం రుద్రమదేవి ఎవరూ సినిమా తీయలేదేం అనుకుంటూ ఉన్నాను. తీస్తున్నారని తెలిపినందుకు సంతోషం. సినిమా చూసేక చెప్పండి ఎలా ఉందో.
మాలతి
శ్రీ కొంపెల్ల శర్మగారికి,
నేను ముందు పంపిన వ్యాఖ్యను దయచేసి తొలగించగలరు. నేను పొరపాటు పడ్డాను. నావద్ద ఉన్నది మూడో సంపుటము.
మీవ్యాసము చూచి చాలా ఆనందించేను. అభినందనలు.
శ్రీ శర్మగారికి
నమస్కారం. మీవ్యాసం అనేక విషయాలతో సమగ్రమైన రచన. ధన్యవాదాలు.
నేను ఇటీవల పిలకా గణపతిశాస్త్రిగారి ప్రాచీనగాథాలహరి చూడడం తటస్థించింది. ఆ పుస్తకానికి ముందుమాటలో రచయిత మూడు సంపుటాలు ప్రచురించదలుచుకున్నట్టు చెప్పేరు. మిగతా రెండు సంపుటాలు ప్రచురణ జరిగిందా. మీకు తెలిస్తే చెప్పగలరు.
మాలతి
రుద్ర త్వమేవాహాన్నీ శ్రీ శ్రీ మహాప్రస్తానాన్నీ అందులో ఏంవుందీ తెలీకముందు ఆ కవితా ప్రవాహాన్ని ప్రాసల్ని పదబంధాల్ని పెద్దగా చదివేసి సంతోషపడేవాళ్లం .- :)) బాగా చెప్పేరండీ. అప్పట్లో తెలుగు మనభాషమ్మా, మనం తప్పకుండా నేర్చుకోవాలి అని పని గట్టుకు చెప్పవలసి వచ్చేది కాదు.
సత్యవతిగారూ, నా ఎగస్ట్రా వ్యాఖ్యలు తీయమంటే మీరు తియ్యలేదు. ఈలోపునే నేను మళ్ళీ వచ్చేసి పూర్తిగా చదివేను. మీ అనుభవాలు చూస్తుంటే నాకు ఈర్ష్యగా ఉంది. నాక్కూడా ఇలా రాయాలని ఉంది....