శ్యామలీయం తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

aanamdam;శ్యామలీయం

అయ్యా,
మీరు సుదీర్ఘంగా వ్యాఖ్యలు వ్రాస్తూ ప్రతి వ్యాఖ్యనూ అనేకచోట్ల అతికించటం వలన అసౌకర్యం కలుగుతోందని చెప్పటానికి చింతిస్తున్నాను.

మీపధ్ధతి కారణంగా అగ్రిగేటర్ల వ్యాఖ్యలపేజీ ముంపుకు గురికావటం కారణంగా ఇతరుల వ్యాఖ్య ఏదైనా గడ్డిమేటులో సూది ఐపోతోంది.

మీరు మీసుదీర్ఘవ్యాఖ్యలను మీబ్లాగులో టపాలుగా ఉంచటం మంచిది.

అన్యధా భావించకండి.
ధన్యవాదాలు.

30 April 2024 12:00 PM

కష్టేఫలి;శ్యామలీయం

పేదవాడి కోపం పెదవికి చేటు అనవచ్చు నండీ. నిస్సహాయతతో వాడు పండ్లు నూఱుకుంటాడూ ఒక్కోసారి పెదవులూ కొరుక్కుంటాడు. పండ్లు గట్టివే కాని పెదవులు కాస్త సుకుమారంగా ఉంటాయి కదా. అవి పగిలే ప్రమాదం కద్దు.

29 April 2024 10:12 AM

విశ్వ చైతన్య శక్తి;శ్యామలీయం

యస్య సర్వే సమారంభాః - కామ సంకల్ప వర్జితాః జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం - తమాహుః పండితం బుధాః - గీ‌త.4.19

మీరు పొరపాటుగా quote చేసారు.

21 March 2024 4:38 PM

చాకిరేవు chaakirev;శ్యామలీయం

పిచ్చ మీడియా అసత్య ప్రచారాలు ఏకపక్ష వార్తల వల్ల విశ్వసనీయత జనంలో పెరుగుతుందాండీ? ఎందుకు వచ్చిన గప్పాలూ?

05 March 2024 8:46 AM

తెలుగు పద్యం;శ్యామలీయం

ఇంద్రశబ్దము శ్రేష్ఠతా వాచకము. నాగమనగా పాము కావచ్చును లేదా యొక యేనుగు కావచ్చును. కాని సందర్భము ననుసరించి నాగ మనగా నిచట నేను గనియే. ఈనాగ శబ్దమునకు ఇంద్రశబ్దమునం జోడించి చెప్పుట యనగా నది యొక శ్రేష్ఠమైన గజరాజ మని చెప్పుట. ఈగజేంద్రుని వైభవము బలము మున్నగునవి కథలో నప్పటికే బాగుగా వర్ణించబడి యున్నవి. అట్టి యేనుగుల రాజునకు ప్రాణములు ఠావులు తప్పుచున్నవి.

12 February 2024 10:16 AM

My Soul On Canvas మనః ఫలకం;శ్యామలీయం

వినాయకుడి బొమ్మ అద్భుతంగా వచ్చిందండీ.
వినాయకుడి బొమ్మ అంటే నాకు తప్పకుండా ఒక తమాషా సంఘటన గుర్తుకు వస్తుంది. మావదిన గారు ఒకవిడ మనవడు జన్మతః మంచి చిత్రకళతో పుట్టాడు. ఒకసారి అతను వేస్తున్న బొమ్మలున్న పుస్తకం చూపించాడు, అందులో వినాయకుడి బొమ్మ ఉంది. ఐతే ఆబొమ్మలో వినాయకుడు మనం నిత్యం చూసేలా బాగా బొద్దుగా కాకుండా సన్నగ ఉన్నడు. "ఇదేమిటయ్యా వినాయకుడు ఇలా సన్నగా ఉన్నాడూ" అని అడిగితే, "వినాయకుడు డైటింగ్ చేస్తున్నాడు" అని చెప్పాడు తక్షణమే తడుముకోకుండా! ఆమాటను మేమంతా భలే ఎంజాయ్ చేసాం. ఆ పిల్లవాడు ఇప్పుడు మంచి ఉద్యోగంలో ఉన్నాడు పెద్దై.

11 February 2024 10:46 PM

శ్యామలీయం;శ్యామలీయం

ఈ కీర్తనను ప్రస్తావిస్తూ ఒక అజ్ఞాత నన్నుతూర్పారబడుతూ ఒక వ్యాఖ్యను పంపారు. దాన్ని ప్రచురించనవసరం లేదు కాని కొందరికి ఉండే అపోహలను తొలగించటం కోసం కొన్ని మాటలు వ్రాస్తున్నాను.

శివపురాణమూ విష్ణుపురాణమూ రెండూ వ్యాసప్రోక్తములే.
శివానందలహరీ శ్రీరామకర్ణామ్తమూ రెండూ శంకరాచార్యులవారి కృతులే.
శివపారమ్యంగా ఒకటి ఉంటే విష్ణుపారమ్యంగా మరొకటి ఉండి కొందరికి సందేహం కలిగించవచ్చు.

05 February 2024 6:45 AM

శ్యామలీయం;శ్యామలీయం

ఆవునండీ నిజమే కదా.

04 February 2024 12:31 PM

శ్యామలీయం;శ్యామలీయం

మంచి సమాచారాన్ని అందించారు.
ధన్యవాదాలు.

04 February 2024 9:44 AM

శ్యామలీయం;శ్యామలీయం

ఇది 2200వ రామకీర్తన.

30 January 2024 5:06 AM

పద్యం - హృద్యం;శ్యామలీయం

ఈ రామతారక శతకం PDF copy మనకు ఆర్కీవ్ సైటు నుండి దిగుమతి చేసుకోవటానికి అందుబాటులో ఉంది.
మీరు https://ia601507.us.archive.org/23/items/in.ernet.dli.2015.331985/2015.331985.Raamataaraka-Shatakamu.pdf అన్న లింక్ ద్వారా సులభంగా దిగుమతి చేసుకొని చదువుకొని ఆనందించగలరు.

29 January 2024 3:45 PM

శ్యామలీయం;శ్యామలీయం

ఇలాంటి విపరీతపు పోకడను పాఠకుల దృష్టికి తేవటమే నా ఉద్దేశం.

27 January 2024 3:21 PM

శ్యామలీయం;శ్యామలీయం

అవునండి
ఇవేవీ నా యేకాగ్రతను చెడగొట్ఠలేవు.

27 January 2024 3:20 PM

శ్యామలీయం;శ్యామలీయం

అదృష్ణం. మీరు కోరుకున్న కీర్తన వచ్చిందండీ.

యోగులు ధ్యానించు హరి యయోధ్యను నేడు
పౌగండప్రాయుడాయె బాలరాముడై

అని ఈకీర్తన కొద్ది సేపటి క్రిందట వెలువడింది.

21 January 2024 10:34 PM

శ్యామలీయం;శ్యామలీయం

కావాలని ఏకీర్తననూ వ్రాయలేనండీ. రామేఛ్ఛ మేరకే వస్తాయి కీర్తనలు.

17 January 2024 11:05 PM

స్మరణ;శ్యామలీయం

భారతి గారు చక్కగా వ్రాసారు. చాలా బాగుంది. సంతోషం.

16 January 2024 10:03 AM

శ్యామలీయం;శ్యామలీయం

హరిబాబు గారు, గానసౌలభ్యాన్ని బట్టి చిన్నచిన్న మార్పులు సహజమండీ. ఐతే అర్ధం మారిపోయేలాగు కాని అసహజంగా ఉండే లాగు కాని, వినటానికి ఇబ్బందిగా ఉండే లాగు కాని సాహిత్యాన్ని మార్పుచేయకూడదు. సాహిత్యం అలాగే ఉండాలి. పాడటంలో కొంచెంగా బాణీని బట్టి హ్రస్వదీర్ఘాదులు వస్తూ ఉండవచ్చును.

ఐతే కొందరు అత్యుత్సాహంగా సాహిత్యానికి మెఱుగులు దిద్దబోయి పాడుచేస్తూ ఉంటారు. వారికి దురుద్దేశం లేకపోయినా ఒక్కోసారి జరిగిన

10 January 2024 1:13 PM

శ్యామలీయం;శ్యామలీయం

అవునా అండీ. మీరు చెప్పిన "రామనామము రామనామము రమ్యమైనది రామనామము" అన్నది బహుళ ప్రచారం పొందినది. అది ఆర్కీవ్స్ సైట్ లోపల ఉంది. ఎక్కడుందో వెదకి పొష్టుచేస్తాను వీలైతే.

26 December 2023 8:28 PM

Jwala's Musings;శ్యామలీయం

విషయానికి కట్టుబడి మాట్లాడండి అనామకులవారూ. వ్యాసంలో చెప్పినది కేసీఆర్ మంచి చేసినా ఓడించారని. ప్రజలు అలా మంచి జరిగింది అనుకుటే ఆయన్న గెలిపించే వారే కాని వారు అలా ఆనుకోలేదని అభిప్రాయం వెలిబుచ్చాను.

అవసరానికి మించిన మంచి చేయటమే కేసీఆర్ పొరపాటు అనటం వ్యాసకర్త పొరపాటూ అసహనమూ అని చెప్పక తప్పదు.

మధ్యలో మీరెవరో అనామకులు వచ్చి నాగురించి అనవసర వ్యక్తిగత వ్యాఖ్యలు చేయటం సబబు కాదు.

17 December 2023 9:46 PM

Jwala's Musings;శ్యామలీయం

ప్రజలు కేవలం సరదాకోసం మార్పును కోరుకోరు కదండీ? తగిన కారణం ఉందనుకుంటేనే కదా మార్పును కోరుకున్నది? గొప్ప అభివృద్ధి సాధించినా దించేసారూ అనటం ప్రజల వివేకాన్ని అవహేళన చేయటమే అవుతుంది.

16 December 2023 10:55 PM