జీడిగుంట విజయసారథి తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

Comments for నా కుటీరం;జీడిగుంట విజయసారథి

చాలా బాగుంది ఈ భాగం భద్రుడు గారు. ఎల్కేజీ మొదలుకుని కనీసం డిగ్రీ వరకు ఉపాధ్యాయులుగా పదవి చేపట్టే ప్రతివారు ఈ పుస్తకం తప్పనిసరిగా చదవాలి. కొద్ది పాటి లోక జ్ఞానం రాగానే విద్యార్థులు కూడా. కేవలం ఇప్పటివరకూ మీరు పంచుకున్న భాగాలు చదివినందుకే టీచర్ వృత్తి పట్ల అపారమైన గౌరవం పెరగడంతో పాటు చిన్నప్పుడు ఈ పుస్తకంలో మీరు తెలిపిన సంగతులు ఎవరైనా చెప్పి ఉంటే పెద్దయ్యాక ఏ డాక్టరో , ఇంజనీర్నో కాకుండా టీచర్ అయ్యే దిశగా జీవితాన్ని నడిపే వాణ్ణేమో.

రూసో సూర్యోదయ దృశ్యం పిల్లలకి ఎలా పరిచయం చెయ్యాలో చెప్పిన ఉదంతం అద్భుతః

మీరు చెప్పిన యాపిల్ ఎగ్జామ్పుల్ లో నేను మూడో విధంగా అంటే ప్రకృతిలో సహజం గా కనబడే వివిధ రకాల షేపులు, లేకపోతే రకరకాల వస్తువులతో చేసే అరేంజ్మెంట్లు, పెయింటింగ్ లలో బొమ్మలు చూసి అవి యాపిల్ లా ఉన్నాయని పోల్చడం గురించి కూడా ఎక్కడో చదివినట్టు గుర్తు.

ఇంక ఈ భాగంలో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ — “బోధన అనేది సహనశీల ప్రక్రియగా జరిగినప్పుడు అది శిక్షణగా కాక, మేల్కొలుపుగా పరిణమిస్తుంది. అటువంటి పాఠశాల నుండి కేవలం నిపుణులు మాత్రమే కాక కళాకారులు, క్రీడాకారులు, కవులు, రచయితలు, వేదాంతులూ కూడా ఉద్భవిస్తారు.” — దీనికి సాక్ష్యం మాకు ప్రత్యక్షంగా కనబడుతోంది. ఆ పాఠశాల, ఆ ఉపాధ్యాయులు, వారి బోధన అన్నీ ధన్యత చెందినట్టే..


10 July 2026 5:47 PM

Comments for నా కుటీరం;జీడిగుంట విజయసారథి

“కృష్ణారావుగారి తల్లి ఆయన శిశువుగా ఉండగానే కాలం చేసారు. అందుకని ఆయన మాతామహుడు ఆ నిసుగుని తన ఒళ్ళో పెట్టుకుని ఆ ఊళ్ళో ఏ తల్లి తన బిడ్డకు పాలుపడుతుందా అని చూస్తూ ఉండేవాడట. అలా ఎందరో తల్లుల స్తన్యంతో ప్రాణం పోసుకున్నాడు కాబట్టే కృష్ణారావుగారు జీవితమంతా మనుషులకోసమే బతికాడు అని మోహనరావుగారు చెప్తున్నప్పుడు నాలో చెలరేగిన అనుతాపతరంగాన్ని నేను వర్ణించలేను.” — ఇది చదివాక నా కళ్ళు, గుండె తడై పోయాయి. ఇటువంటి మహానుభావుని గురించి ఆయన శతజయంతి నాడైనా ఇలా మొదటిసారి తెలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉన్నా.. ఇప్పటి వరకూ ఈయన పేరు కూడా విననందుకు చాలా సిగ్గు పడుతున్నాను భద్రుడు గారు.


09 July 2026 9:53 PM

Comments for నా కుటీరం;జీడిగుంట విజయసారథి

అద్భుతం గా పరిచయం చేశారు మీ కొత్త ప్రపంచాన్ని, కొఠారి కమిషన్ నివేదిక రూపకల్పనలో ప్రముఖ పాత్ర వహించిన ప్రసిద్ధవిద్యావేత్త జె.పి.నాయక్ ప్రతిపాదించిన ‘క్వాంటిటీ, క్వాలిటీ, ఈక్విటీ’ అంశాల చట్రంలో బిగిస్తూ. మీ దినచర్యలు, మాస్టర్లతో సావాసాలు చదువుతుంటే.. మీతో పాటే మీ క్లాస్ రూమ్ లో , తాడికొండ డార్మిటరి లో, ప్లే గ్రౌండ్ లో మీతో పాటే చదువుకున్న స్కూల్ మేట్, రూమ్మేట్ , టీమ్మేట్ , క్లాస్మేట్ , బెంచి మేట్ లా ఉండి ఉంటే ఎంత బాగుండేదో అనిపిస్తోంది…


09 July 2026 8:12 PM