కాంత్ తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

భువి భావనలు;కాంత్

అటూ, ఇటూ ఒక 'T'

27 March 2024 5:31 AM

తెలుగు తూలిక;కాంత్

“దంపతులు ఇద్దరు కారు ఒక్కరే” అన్నది కార్యార్థపరంగా కరెక్ట్ అయి ఉండవచ్చు అంతమాత్రంచేత దంపతులు ఏకవచనమే (వ్యాకరణపరంగా) అన్నది కరెక్ట్ అవుతుందని నేననుకోను. మీరు “దంపతులు వచ్చింది/వచ్చాడు” అని అనరు కదా? దీనికి మీరు couple goes shopping అని ఉదాహరణ ఇవ్వడం కూదా సరి కాదు. మీరు ఆ పదాల literal meaning ని వ్యాకరణానికి అన్వయించి చెపుతున్నారు. అంచేత దంపతులు బహువచనమే.
– Just my 2 cents.

మెచ్చుకున్నవారు


14 December 2023 1:43 AM

గెల్లి ఫణింద్ర విశ్వనాధ ప్రసాదు పై వ్యాఖ్యలు;కాంత్

పై లింకు పని చెయ్యడం లేదండీ. సరిజెయ్యగలరు


17 October 2023 7:47 PM

అనుపల్లవి;కాంత్

అయ్యా ఎనానిమస్సుగారూ,
ఆయన బ్లాగులు ఆయన ఇష్టం. కాదనను. కాని చదివేది నాలాంటి, మీలాంటి పాఠకులు కదా. ఆయన చాలా బాగా రాస్తారు. అందుకే చదువుతున్నాను. చదివి, నాకు తోచిన సలహాతో కామెంటు పెడుతున్నాను. కాని తెలుగు బ్లాగు కాబట్టి ఎక్కువ తెలుగు ఉపయోగిస్తే బాగుంటుందంటున్నాను. అంతే కాని వేరే ఉద్దేశం లేదు.

బుచికిగారూ,
నేనేదో తెలుగులో పీ.ఎచ్.డీ. చేసేననుకోకండి. నాదీ మీలాగే ఇంటర్ వరకు తెలుగు మీడియమే. నాదీ సుమారు మీ వయసే. కాకపోతే నేను ఆంధ్రలో ఉన్నది ఒక 16 ఏళ్ళు మాత్రమే (బి.టెక్. వరకు చదువుకోసం). అందుకే తెలుగంటే కొంచం ఎక్కువ అభిమానం.

20 May 2023 6:20 AM

అనుపల్లవి;కాంత్

మీరు బహుశా తెలుగు సినిమాలు, అందులో తెలుగు సంభాషణలు వినకుండా, తెర మీద వచ్చే ఇంగ్లిష్ సబ్‌టైటిల్స్ చదువుతూ చూస్తారనుకుంటా. లేదా, మీరు కాలేజ్‌లో చదువుకునే రోజుల్లో మీ తెలుగు లెక్చరర్, ఏదో సినిమాలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం లాంటి వారై ఉండాలి. మీకు తెలుగును కూడా ఇంగ్లీష్‌లో నేర్పినట్టున్నారు.

ఇంగ్లీష్ బ్లాగులు రాసి మీలోని ఆంగ్ల ప్రతిభనంతా చూపించుకోండి. ఎవరూ వద్దనరు. కాని వాటిని తెలుగు బ్లాగులని చెప్పి ఇలా కూడలిలో పెట్టకండి. మీకు తెలుగు అంత బాగా రాకపోతే, మొదట నేర్చుకొని తర్వాత తెలుగులో బ్లాగండి.

రామాయణాన్ని సినిమాగా తీస్తే అందులోని పాత్రలన్నీ తెలుగు ప్రేక్షకుల సౌలభ్యంకోసం తెలుగే మాట్లాడతాయి. అంతే గాని సీత నేపాలీలోను, రాముడు హిందీలోను, రావణుడు సింహళంలోను మాట్లాడరు. అలాగే, సీతారామం సినిమాలో దుల్కర్ మళయాళంలోను, మృణాల్ మరాఠీలోను, రష్మిక కన్నడంలోను మాట్లాడితే మీకు తిక్క రేగుతుందా రేగదా? అర్థమయిందనుకుంటా. ఇక ఉంటా.

ఇంత పెద్ద కామెంట్ పెట్టినందుకు క్షంతవ్యుడిని. ఒకేసారి ఇంత తెలుగు చదవడం అర్థం కాకపోతే సుందర్ పిచ్చయ్ ని కాస్త సంప్రదించండి (గూగుల్ ట్రాన్స్‌లేషన్). ధన్యవాదాలు.

19 May 2023 12:10 AM

సొమ్ము = డబ్బు/ ధనము / ఆబరణము;కాంత్

అంటే సుందరానికి (పిచాయ్) ఇంకా తెలుగు రాదన్నమాట. సత్య తెలుగువాడు కాబట్టి, బింగ్ కి తెలుగు తెలుసు :-)

15 April 2023 6:59 PM

కాదేదీ బ్లాగ్ కు అనర్హం;కాంత్

బాపట్ల బాబయ్య గురించి విపులంగా తెలియజేసారు. ధన్యవాదాలు. మరి ఇజీనారం ఈరయ్య గురించి కూడా ఇలాగే రాస్తారా?

12 January 2023 9:13 PM

కాదేదీ బ్లాగ్ కు అనర్హం;కాంత్

బాపట్ల బాబయ్య గురించి విపులంగా తెలియజేసారు. ధన్యవాదాలు. మరి ఇజీనారం ఈరయ్య గురించి కూడా ఇలాగే రాస్తారా?

12 January 2023 9:13 PM

కాదేదీ బ్లాగ్ కు అనర్హం;కాంత్

బాబయ్య సినిమా కాంట్రాక్ట్: నా సినిమాలో నటించే నటీనటులంతా నా కన్నా వయసులో చాలా చిన్నవాళ్ళై ఉండాలి. నా పాత్ర మట్టుకు సినిమాలో ఆ నటీనటులకి తమ్ముడిగానో, అల్లుడుగానో, కొడుకుగానో, మనవడుగానో నటించేలాగా ఉండాలి.

12 January 2023 9:11 PM

కాదేదీ బ్లాగ్ కు అనర్హం;కాంత్

బాబయ్య సినిమా కాంట్రాక్ట్: నా సినిమాలో నటించే నటీనటులంతా నా కన్నా వయసులో చాలా చిన్నవాళ్ళై ఉండాలి. నా పాత్ర మట్టుకు సినిమాలో ఆ నటీనటులకి తమ్ముడిగానో, అల్లుడుగానో, కొడుకుగానో, మనవడుగానో నటించేలాగా ఉండాలి.

12 January 2023 9:11 PM

తెలుగు వెన్నెల;కాంత్

నాకు తెలీక అడుగుతాను. వైకుంఠ ఏకాదశి ఒక పండగ కాదు. దానిని ఎవరూ ఒక సంబరంలా జరుపుకోరు. దానికి శుభాకాంక్షలు చెప్పడం సముచితమేనా? విజ్ఞులెవరైనా వివరించగలరు.

02 January 2023 10:58 PM

నాన్న;కాంత్

మీ వాట్సాప్ మిత్రుణ్ణి ఇది అడగండి - ఏడు చేపల్లో ఒక చేప ఎండలేదని చాలా పరిశోధన చేసి ప్రఖ్యాతి పొందిన తెలుగు రాజెవరు?

10 June 2021 5:42 AM