శామల తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

ఈమాట;శామల

కాపీ రైట్!

‘ఈ రెయిళ్ళూ గియిళ్ళూ మనవేదాల్లో ఉన్నాయిష’ వంటి తెలుగువారి సొత్తు అనదగిన ప్రసిద్ధ వాక్యాలని కథలలోనూ ప్రసంగాలలోనూ వాడుకునే పెద్ద మనుషులు (కొంచెం ఎక్కువ పెద్ద రమణలు) గురజాడవారిని తలుచుకుంటారు. అది సత్సంప్రదాయం.

వేమన, మాయాబజార్, పోతన, కన్యాశుల్కం ముచ్చట్లు “ఫలానా రచయిత సౌజన్యంతో” అని ఉదహరించక పోయినా కాపీరైటు ఉల్లంఘన అనిపించుకోదు. అందరెరిగిన ఆంధ్రులు వారు.

ఎక్సెప్షన్ రూల్ కాకూడదు. తెలుగువారికి మేధోహక్కుల మీద పెద్దగా గౌరవం లేదనుకుంటాను.

ఈమధ్య ఒక ప్రముఖ ఆంగ్ల రచయిత రాసిన కథ తాలూకు మక్కీకి మక్కీ ఆంధ్రానువాదం ఒక ప్రముఖ పత్రికలో ప్రచురితమయింది. అనువాదం అన్న ఊసేలేదు ఎక్కడా. మక్కీలు సరిగ్గానే పడ్డాయి కానీ అనువాదం హైస్కూల్ విద్యార్ధి స్థాయిలో ఉంది. దిగులు పడుతూనే చివరిదాకా చదివాను. చివర్లో ‘మూలం’ అంటూ ఓ లింకిచ్చి రచయిత, సంపాదకుడు ‘…కురుతే పాపం …ప్రతిముచ్యతే’ చేసుకున్నారు.


24 April 2024 1:43 PM