తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

వ్యాఖ్య వ్రాసిన సమయం: September 19th, 2017, 5:33pm వ్యాఖ్యాత : Zilebi | బ్లాగు : వరూధిని

సోరణగండి వెల్తురున సోగతనమ్ముల మత్తుగానుచు
న్నో రమణీ జిలేబియ ! మనోరమ ! గాంచితివా కలన్? యెటన్
భారవి వ్రాసె భారతముఁ బాడిరి దానిని రాఘవాత్మజుల్?
సారవమున్ భళీ యనుచు చక్కగ గట్టితి వమ్మ సోదరీ !

జిలేబి

సోరణగండి - గవాక్షము
వ్యాఖ్య వ్రాసిన సమయం: September 19th, 2017, 5:23pm వ్యాఖ్యాత : Zilebi | బ్లాగు : వరూధిని

సోరణి గండి వెల్తురున సోగతనమ్ముల మత్తుగానుచు
న్నో రమణీ జిలేబియ ! మనోరమ ! గాంచితివా కలన్? యెటన్
భారవి వ్రాసె భారతముఁ బాడిరి దానిని రాఘవాత్మజుల్?
సారవమున్ భళీ యనుచు చక్కగ గట్టితి వమ్మ సోదరీ !

జిలేబి
వ్యాఖ్య వ్రాసిన సమయం: September 19th, 2017, 5:21pm వ్యాఖ్యాత : Zilebi | బ్లాగు : వరూధిని

అర్జును శివుని కథ యద్భుతము, గనుము
భారవియె రచించె, భారతమును
తాను గైకొని యొక తటమును గ్రహియించి
చిరముగ నతడు నిలిచె భువి లోన!

జిలేబి
వ్యాఖ్య వ్రాసిన సమయం: September 19th, 2017, 4:12pm వ్యాఖ్యాత : Haribabu Suranenii | బ్లాగు : వరూధిని
అవును!ఆయనకి బ్లూవేల్ కన్న నా బ్లాగే మత్తెక్కిస్తా వుందిస్మీ:-)
వ్యాఖ్య వ్రాసిన సమయం: September 19th, 2017, 4:08pm వ్యాఖ్యాత : Janardhan Pittala | బ్లాగు : Padmarpita...
జీవితం ఆగదు నడుస్తూ ఉంటే అసలు రంగులు బయట పడతాయి.
మనం తొందరపడి కలత చెంది తెలుసుకొవలి ప్రయత్నించి ప్రయోజనం ఉండదు పద్మ.
Life is a game of challenges lets play with pleasure and power my dear.
వ్యాఖ్య వ్రాసిన సమయం: September 19th, 2017, 3:37pm వ్యాఖ్యాత : Surya | బ్లాగు : నెమలికన్ను
రావి కొండలరావు దర్శకత్వంలో, గొల్లపూడి మారుతీరావు గిరీశంగా నటించిన కన్యాశుల్కం సీరియల్ లో పీసపాటి నరసింహమూర్తి గారు లుబ్ధావధాన్లు పాత్రకి జీవం పోశారనే చెప్పాలి. 99TV వారు ప్రసారం చేసిన అన్ని ఎపిసోడ్ లూ యూట్యూబ్ లో ఉన్నాయి.
వ్యాఖ్య వ్రాసిన సమయం: September 19th, 2017, 2:48pm వ్యాఖ్యాత : Haribabu Suranenii | బ్లాగు : రచ్చబండ
హరిహరాద్వైతం గురించి చెప్పిన ఇన్ని వేల సంవత్సరాల తర్వాత పురాణ కధల్లో శివుడూ విష్ణువూ ఇద్దరితోనూ ఒకే రకమైన దుష్టశిక్షణ చేయిస్తూ విష్ణువు యోగనిద్రలో శివుణ్ణీ శివుడు తపోనిష్ఠలో విష్ణువునీ దర్శిస్తూ ఉంటారని చెబుతూ "శివాయ విష్ణురూపాయ" అని బల్లగుద్ద్ చెప్పేశాక ఈ రెండు దేవుళ్ళ అలయాలూ కామన్ భక్తులతో కిటకిటలాడిపోతున్న ఇప్పుడు "వైష్ణవం,శైవం అనే వర్గ పోరుతో రగిలిపోయే హిందువులు నిజమైన హిందువులు కాగలరా?" అని ప్రశ్నంచడమే విడ్డూరం!
వ్యాఖ్య వ్రాసిన సమయం: September 19th, 2017, 2:46pm వ్యాఖ్యాత : Haribabu Suranenii | బ్లాగు : రచ్చబండ
This comment has been removed by the author.
వ్యాఖ్య వ్రాసిన సమయం: September 19th, 2017, 2:37pm వ్యాఖ్యాత : Zilebi | బ్లాగు : వరూధిని

భట్టీ పట్టంగదగున్
గట్టిగ పద్యములనెల్ల గగ‌నకుసుమమై
నట్టివి యైన జిలేబీ
చట్టని చిక్కును జిగీష చక్కగ గానన్ :)

జిలేబి
వ్యాఖ్య వ్రాసిన సమయం: September 19th, 2017, 2:29pm వ్యాఖ్యాత : Janardhan Pittala | బ్లాగు : Padmarpita...
Life is like a Rubik's cube, you go through twists and turns, but there is always a solution (జీవితం ఒక రూబిక్స్ క్యూబ్ లా ఉంటుంది, మలుపులు మరియు మెలికలు. కానీ తప్పక ఒక పరిష్కారం ఉంది)
The game of life has two participants...spectators and players. Pick one.
వ్యాఖ్య వ్రాసిన సమయం: September 19th, 2017, 2:16pm వ్యాఖ్యాత : Zilebi | బ్లాగు : వరూధిని

చూచెడు కనులకు తెలియును
కాచిన వన్నియు ఫలముల కర్మఫలములా
ఓ చినదాన! జిలేబీ
యోచన జేయన్నఖండ యోగంబిదియే !

జిలేబి
వ్యాఖ్య వ్రాసిన సమయం: September 19th, 2017, 2:16pm వ్యాఖ్యాత : Haribabu Suranenii | బ్లాగు : పల్లెప్రపంచం
అసలు ఆ నాడు జరిగిన విలీనం/విమోచనం/విద్రోహం అనే సంఘతనల్లో పాల్గొన్నవారికి గానీ ఇప్పుడు ఇక్కడ చర్చలో పాల్గొని అభిప్రాయాలు చెబుతున్నవారికి గానీ ఈ సంఘటన వల్ల గానీ దానికి ఏ పేరు పెట్టాలన్నదాని గురించి గానీ తెలంగాణ ప్రజల దృష్టితో ఆలోచించినవారు ఎవరూ లేరు,ఏమిటో ఈ మాయ!అనాడు ఆ వీరకార్యాలు చేసిన ప్రతివారూ వ్యక్తిగత కీర్తి ప్రతిష్ఠల కోసమే చేసారు.ఇవ్వాళ ఆ సంఘటనని ఏ పేరుతో పిలవాలి అనేది వారి పాండిత్యానికి సంబంధించిన విషయమ య్యింది.

కాబట్టి june 2 తెలంగాణాప్రజావిద్రోహదినం అనటం అన్ని విధాలా తగినది - భశుం:-)
వ్యాఖ్య వ్రాసిన సమయం: September 19th, 2017, 2:04pm వ్యాఖ్యాత : Zilebi | బ్లాగు : వరూధిని

చదవమని యెవరు చెప్పా
రె,దరువులదురన్ జిలేబి రెప్పల్మూయన్
కుదురున యెవ్వారికినౌ !
పదపడి కందపు పదముల పారించదగున్ :)

జిలేబి
వ్యాఖ్య వ్రాసిన సమయం: September 19th, 2017, 1:39pm వ్యాఖ్యాత : Haribabu Suranenii | బ్లాగు : రచ్చబండ
హరిహరాద్వైతం గురించి చెప్పిన ఇన్ని వేల సంవత్సరాల తర్వాత పురాన కధల్లోనూ శివుడూ విష్ణువూ ఇద్దరితోనూ ఒకే రకమైఅన్ దుష్తశిక్షన చేయిస్తూ విష్ణువు యోగనిద్రలో శివుణ్ణీ శివుడు తపోనిష్ఠలో విష్ణువునీ దర్శిస్తూ ఉంటారని చెబుతూ "శివాయ విష్ణురూపాయ" అని బల్లగుద్ద్ చెప్పేశాక ఈ రెండు దేవుళ్ళ అలయాలూ కాబన్ భక్తులతో కిటకిటలాడిపోతున్న ఇప్పుడు "వైష్ణవం,శైవం అనే వర్గ పోరుతో రగిలిపోయే హిందువులు నిజమైన హిందువులు కాగలరా?" అని ప్రశ్నంచడమే విడ్డూరం!
వ్యాఖ్య వ్రాసిన సమయం: September 19th, 2017, 1:37pm వ్యాఖ్యాత : Zilebi | బ్లాగు : వరూధిని

ఓ కూనలమ్మ ! పదముల్
జోకుల్ పద్యపు జిలేబి జోకము లన్నీ
చేకురు నమ్మ యతనమున
శాకంబరి దయ దలచగ సాధింపదగున్ !

జిలేబి
వ్యాఖ్య వ్రాసిన సమయం: September 19th, 2017, 1:02pm వ్యాఖ్యాత : కూనలమ్మ | బ్లాగు : కూనలమ్మ
తనయిష్టం తనదట
వ్రాయకుండ లేరట
పాఠకుల కర్మమట
ఓ కూనలమ్మా

వ్రాసి నీరస పడను
చదువ ప్రయాసపడను
కన వినోదం బగును
ఓ కూనలమ్మా
వ్యాఖ్య వ్రాసిన సమయం: September 19th, 2017, 12:08pm వ్యాఖ్యాత : Zilebi | బ్లాగు : వరూధిని

గద్యంబన కవితలహో!
విద్యయనగ హైకు! విర్ర వీగు జిలేబీ
హృద్యంబగు పదములనన్
పద్యమ్ముల వ్రాయునట్టివాఁ డల్పుఁ డగున్!

జిలేబి
వ్యాఖ్య వ్రాసిన సమయం: September 19th, 2017, 12:07pm వ్యాఖ్యాత : Sujata | బ్లాగు : వేణువు
Ronald Dahl ఆత్మకథ లో చదివాను. ఫైటర్ పైలట్ గా యుద్ధంలో పాల్గొన్నప్పుడు విమాన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, కొన్ని నెలల పాటూ చూపును కోల్పోతాడు. స్పృహ లోకొచ్చాకా, ఆ గుడ్డితనంలో తను ఆదరంగా చూసిన నర్స్, ఆమె గొంతు నే ఆలంబనగా బ్రతికి బట్టకట్టి, ఆమెని (గొంతునీ, ఆదరణ నీ) ప్రేమించి, చూపొచ్చాకా ఆమె ఎంతో అందమయిన యువతి అనుకుని ప్రపోస్ చేద్దామని అనుకుంటాడు. చూపు వచ్చాకా ఆ ప్రియతమ నర్స్ ని చూద్దామని
వ్యాఖ్య వ్రాసిన సమయం: September 19th, 2017, 11:57am వ్యాఖ్యాత : Zilebi | బ్లాగు : వరూధిని

చోద్యమిదియే జిలేబీ
పద్యమ్ముల వ్రాయునట్టివాఁ డల్పుఁ డగున్,
గద్యములకు చెల్లె హరిమ!
విద్యయనగ యింగిలీసువింగ్లీసులహో :)

జిలేబి
వ్యాఖ్య వ్రాసిన సమయం: September 19th, 2017, 11:21am వ్యాఖ్యాత : Zilebi | బ్లాగు : వరూధిని

భస్మాసుర హస్తము

ఆయాసము చదువరులకు
యీయమ్మ జిలేబి బాస యిక్కట్లపడన్,
సాయము బట్టితి నాడౌ
సోయగముల శతకమొకటి సొబగుగ బేర్చీ :)

బూమ్రాంగ్
జిలేబి :)
వ్యాఖ్య వ్రాసిన సమయం: September 19th, 2017, 11:20am వ్యాఖ్యాత : నీహారిక | బ్లాగు : Padmarpita...
సీతాకోకచిలుక ఉన్న రంగులన్నీ కుదవుపెట్టి
తన అసలు రంగు వెలసిపోయేలా చేసుకుంది!

రంగు పోతే పోయింది మనసు ముఖ్యం కదా ? మనసుని గుర్తించడం లేదని కదా బాధ ? రంగు చూసి వచ్చినవారు మనసుని ఎలా చూడగలరు ? (ముందు)చూపేలేని వారు గుర్తిస్తే ఎంత ? గుర్తించకపోతే ఎంత ? ఎప్పటికైనా, ఎంతవారలైనా జీవిత పాఠం నేర్చుకోడానికి "ఖరీదు" చెల్లించక తప్పదని గుర్తించండి. అప్పటిదాకా నిర్లిప్త పయనమే సీతాకోక చిలుకకి మంచిది.
వ్యాఖ్య వ్రాసిన సమయం: September 19th, 2017, 11:08am వ్యాఖ్యాత : Zilebi | బ్లాగు : వరూధిని

సెగయై కందపు పద్యము
జగత్తున వెలుగవలెన్ బజారుల తీరున్
గగురువు కలిగించ వలెన్
జగణము లుర్రూతలూగ జాణ జిలేబీ :)

జిలేబి
వ్యాఖ్య వ్రాసిన సమయం: September 19th, 2017, 10:57am వ్యాఖ్యాత : నీహారిక | బ్లాగు : పల్లెప్రపంచం
జూన్ రెండు తెలంగాణా ద్రోహుల దినం !
Copyright 2016 Sodhini. All Rights Reserved | Privacy Policy

Page Last Updated: Tue 19 Sep 2017 06:30:06 PM GMT

blogillu telugu